For Money

Business News

క్రూడ్‌ పరుగు ఆపతరమా!

తమ వద్ద వున్న వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగించి… ప్రస్తుత చమురు డిమాండ్‌ను ఎదుర్కొంటామని అమెరికా ప్రకటించినా… క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆగడం లేదు. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఏప్రిల్‌ నెల క్రూడ్‌ కాంట్రాక్ట్‌ 116.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే నెలల కాంట్రాక్ట్‌ను కూడా దాదాపు ఇదే ధర వద్ద కొంటున్నారు. రష్యా ఆయిల్‌ మార్కెట్‌ పూర్తి బంద్‌ కావడంతో అనేక దేశాలు పూర్తిగా ఒపెక్‌పై ఆధారపడ్డాయి. అమెరికా ఉత్పత్తి ఆ దేశానికి, పొరుగు దేశాల డిమాండ్‌కు సరిపోతుంది. అలాగే కెనెడా కూడా. అయితే రష్యాపై ఇన్నాళ్ళు ఆధారపడిన యూరప్‌ దేశాలు ఇపుడు ఒపెక్‌పై ఆధారపడుతున్నాయి. వెంటనే డిమాండ్‌కు తగ్గ చమురు ఉత్పత్తిని పెంచే మార్గం లేకపోవడంతో మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ వివాదం ఇంకా కొనసాగితే త్వరలోనే క్రూడ్‌ ధర 125 డాలర్లకు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి.