భారీగా క్షీణించిన క్రూడ్ ఆయిల్
రాత్రి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. ఈనెల 24న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 123 డాలర్లకు చేరగా, రాత్రి 106.7 డాలర్లకు క్షీణించింది. నిన్న ఒక్క రోజూ క్రూడ్ ధరలు 8 శాతంపైగా క్షీణించాయి. ఇవాళ ఉదయం స్వల్పంగా క్షీణించి 108.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రష్యా నుంచి క్రూడ్ దిగుమతులను నిషేధించేందుకు పలు యూరో దేశాలు నిరాకరించడంతో పాటు ఈసారి టర్కీలో చర్చలు ప్రారంభం అవుతుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. WTI క్రూడ్ కూడా 104.77 డాలర్లకు తగ్గింది.మరోవైపు కరెన్సీ మార్కెట్లో డాలర్ విలువ బాగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 99ను దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గినా.. మన దేశంలో మాత్రం వెంటనే తగ్గేలా లేవు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఇపుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పూడ్చుకుంటున్నాయి.