For Money

Business News

దుమ్ము రేపుతున్న క్రూడ్‌ ధరలు

రాత్రి అమెరికా క్రూడ్‌ నిల్వలు అనూహ్యంగా భారీగా క్షీణించాయి. దీంతో WTIతో ఆటు బ్రెంట్ క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా మార్కెట్‌లో కూడా క్రూడ్‌ డిమాండ్‌ పెరగడంతో అక్కడ క్రూడ్‌ ధర 84 డాలర్లకు చేరగా, ఆసియా దేశాలు కొనే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 85 డాలర్లను దాటింది. డాలర్‌ డాండెక్స్‌ 94 డాలర్లపై ఉన్నందున భారత్‌ వంటి దేశాలు క్రూడ్‌ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. క్రూడ్‌ భారీగా పెరగడానికి మరో కారణం అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో భారీ వృద్ధి రేటును సాధించడం. దీంతో క్రూడ్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఫలితంగా అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది.