For Money

Business News

క్రూడ్‌ దూకుడు… కంపెనీలకు దడ

విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం… యూపీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచకుండా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వాయిదా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌, క్రూడ్‌ పెరగడంతో ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. కేంద్రం ధరలు పెంచడానికి విముఖత చూపడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధర 76.40 డాలర్లకు చేరింది. ఈ ఏడాది లోగా ముడి చమురు ధర 100 డాలర్లకు చేరే అవకాశముందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా హెచ్చరిస్తోంది. డాలర్‌ కూడా క్రమంగా బలపడి… అధిక స్థాయిలో స్థిరంగా ఉంది. సౌదీ అరేబియా కాస్త డిస్కౌంట్‌తో మనకు ముడి చమురు అమ్ముతున్నా… భారత్‌ ఇపుడు అమెరికా, ఇరాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి భారీగా కొంటోంది. దీంతో అధిక క్రూడ్‌ ధరల ఒత్తిడి మన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై ఉంటోంది.