భారీగా క్షీణించిన క్రూడ్ ఆయిల్
తన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వల నుంచి క్రూడ్ విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ భారీగా క్షీణించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తరవాత గత 9వ తేదీన 130 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్ ఆ తరవాత 16వ తేదీ కల్లా వంద డాలర్లకు దిగువకు వచ్చింది. కాని తరవాత క్రమంగా పెరుగుతూ గత నెల 24వ తేఈన మళ్ళీ 122 డాలర్లకు చేరింది. రష్యా క్రూడ్ కొనుగోళ్ళను ఆపేందుకు యూరప్ దేశాలు ససేమిరా అనడంతో క్రూడ్ తగ్గడం ప్రారంభించింది.అయినా 110 డాలర్లపైనే ఉండేది. అయితే అమెరికా తాజా ప్రతిపాదనతో క్రూడ్‌పై ఒత్తిడి పెరిగింది. ఎలాంటి పరిస్థితిలోనూ సరఫరా పెంచమని ఒపెక్ స్పష్టం చేయడంతో అమెరికా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రూడ్ ఇపుడు 104 డాలర్లకు క్షీణించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తాలూకు ప్రభావం తగ్గినా.. లేదా అమెరికా తుది నిర్ణయం ప్రకటిస్తే క్రూడ్ 100 డాలర్ల దిగువకు వచ్చే అవకాశాలు అధికంగా ఉంది.