డాలర్ డౌన్… ఆల్ అప్
డాలర్ ఇవాళ బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ అరశాతం నష్టంతో 93.04 వద్ద ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ పతనంగా స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్, క్రూడ్ మార్కెట్…అన్నీ పరుగులు పెడుతున్నాయి. నాస్డాక్ ఏకంగా 1.5 శాతం పెరగ్గా, ఎస్ అండ్ పీ 500 సూచీ ఒక శాతం, డౌజోన్స్ 0.77 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్ పతనం కారణంగా కమాడిటీ మార్కెట్ దూకుడు పెంచింది. వెండి రెండు శాతం పైగా పెరగ్గా, బంగారం ఒక శాతం పెరిగింది. అన్నింటికన్నా భారీగా పెరిగింది క్రూడ్. వరుసగా ఏడు రోజులు క్షీణించిన క్రూడ్ ఇవాళ ఏకంగా అయిదు శాతంపైగా పెరిగింది.WTI క్రూడ్, బ్రెంట్ క్రూడ్ కూడా అయిదు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి.