క్రూడ్ ఆయిల్ దూకుడు
బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. డాలర్ బలహీనపడటంతో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. WTI క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్లను దాటగా, ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 78.32 డాలర్లకు చేరింది. ఒకదశలో 79.23 డాలర్లకు చేరింది. వరుసగా అయిదు రోజులుగా పెరుగుతున్న క్రూడ్. డాలర్ ఇండెక్స్ బలహీనంగా ఉన్నా 93పైనే ఉండటం, క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో భారత్ వంటి దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్ బదులు డీజిల్ ధరలు పెంచడం ప్రారంభించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.