కొత్త ఐపీఓ షేర్లు ఉన్నాయా?
మీరు ఈ మధ్యే ఐపీఓలో షేర్లు తీసుకున్నాయి. కొన్నా లేదా ఐపీఓలో అలాట్‌మెంట్ జరిగినా… ఆ కంపెనీల గురించి జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే రానున్న మూడు నెల్లలో కొత్త ఐపీఓల ముందు జరిగిన అంటే ప్రీ ఐపీఓ లాకిన్ షేర్లు అన్‌లాక్ కానున్నాయి. ముఖ్యంగా మూడు నెలల లాకిన్‌లో ఉన్న షేర్లు ఇపుడు అన్‌లాక్‌కానున్నాయి. గత ఏడాది చివర్లో భారీ ఎత్తున ఐపీఓలు వచ్చాయి. ఆ సందర్భంగా చాలా సంస్థలు ప్రి ఐపీఓలో షేర్లు కొన్నాయి. అవన్నీ ఇపుడు అన్‌లాక్ కానున్నాయి. అంటే ఆ షేర్లను ఇపుడు ట్రేడింగ్‌కు రెడీ కానున్నాయి. కేవలం వచ్చే 3 నెలల్లో మార్కెట్‌కు 87 కంపెనీల షేర్లు అన్‌లాక్ కానున్నాయి. ఇలా అన్‌లాక్ కానున్న షేర్ల విలువ సుమారు రూ. 6 లక్షల కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. అంటే కొత్త షేర్లు వరదలా వచ్చి చేరుతాయన్నమాట. దీంతో ఆ షేర్ల ధరలపై ప్రభావం ఉంటుంది. నిన్న అర్బన్ కంపెనీ నుంచి షేర్ల వరద ప్రారంభమైంది. ఒక్క రోజే మార్కెట్‌లోకి 94.1 కోట్ల షేర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 13.1 కోట్ల జీకే ఎనర్జి షేర్ల లాకిన్ ఇన్ కూడా పూర్తయింది. అంటే ఈ షేర్లు ఇపుడు ట్రేడింగ్‌కు వస్తున్నాయన్నమాట. అలాగే ఈవారంలోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు చెందిన 70 లక్షల షేర్లు అన్‌లాక్ కానున్నాయి. అయితే అన్‌లాక్ అయ్యే షేర్లలో చాలా వరకు ప్రమోటర్ల వద్ద ఉంటాయని, అవి వెంటనే అమ్మకానికి రాకపోవచ్చని కొందరు అనలిస్టులు అంటున్నారు. అలాగే కంపెనీ సామర్థ్యంపై ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు, సంస్థాగత దేశీ ఇన్వెస్టర్లు కూడా వెంటనే అమ్మకపోవచ్చని వీరు అంటున్నారు. అంటే మంచి కంపెనీల షేర్లు భారీగా తగ్గే ఛాన్స్ ఉండదన్నమాట. అయితే వీక్ కంపెనీలు, ఆపరేట్ చేసిన షేర్లలో మాత్రం ఒత్తిడి ఉంటుంది.
