వేసవిలో విద్యుత్ కోతలు తప్పవా?
బొగ్గు ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోల్ ఇండియా కోరుతోంది. ధరలు పెంచని పక్షంలో
బొగ్గు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందని ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ హెచ్చరించారు. సిబ్బంది వేతనాల పెంపు, బొగ్గు మైనింగ్ చేసే చోట వివిధ పరికరాలకు వాడే డీజిల్ ధరల పెరగడంతో వ్యయం పెరుగుతోందని ఆయన అంటున్నారు. వివిధ సంస్థలు, రాష్ట్రాలతో కుదుర్చుకున్న దీర్ఘకాల సరఫరా ఒప్పందాల్లో బొగ్గు ధరను పెంచడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఆయన అన్నారు. .థర్మల్ విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గులో 70 శాతం కోల్ ఇండియానే సరఫరా చేస్తోంది. గత ఏడాది ఉత్పత్తి భారీగా పడిపోవడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇపుడు ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వకపోతే…బొగ్గు ఉత్పత్తి తగ్గే అవకాశముంది. పరోక్షంగా దీని ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడుతుంది. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరుగుతుంది. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు గత సెప్టెంబరులో కనిష్టానికి చేరుకున్నాయి.