For Money

Business News

పెరగనున్న సీఎన్‌జీ ధర

కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా సీఎన్‌జీ దరలు పెరగనున్నాయి. ప్రస్తుతానికి గృహ అవసరాలకు వాడే సీఎన్‌జీ ధరలు పెరగకున్నా.. వాహనాల్లో వాడే సీఎన్‌జీ ధర ఖచ్చితంగా పెరుగుతుందని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు అంటున్నాయి. పలు నగరాల్లో సీఎన్‌జీ సరఫరా సదుపాయం ఉంది. ఈ నగరాల్లో గృహ అవసరాలతో పాటు వాహనాలకు కూడా సీఎన్‌జీ వాడుతారు. డీజిల్‌, పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ ధర తక్కువ. తాజాగా వివిధ సిటీ గ్యాస్‌ డిస్ట్రబ్యూషన్స్‌కు కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దాదాపు ఈ కోత 20 శాతం దాకా ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఇంద్రప్రస్థ గ్యాస్‌తోపాటు ఇతర కంపెనీలకు కేంద్రం నుంచి నోటీసులు అందాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో ఇతర కంపెనీల గ్యాస్‌ కంటే కేంద్ర ప్రభుత్వం చౌక ధరకు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌కు సరఫరా చేస్తోంది. ఇపుడు సరఫరాలో కోత పడటంతో, కంపెనీలు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు ఇతర కంపెనీల నుంచి కొనాల్సి ఉంటుంది. అధిక ధరకు కొన్నా… గృహ అవసరాలకు వాడే సీఎన్జీ ధర పెంచే అవకాశం లేనందు… వాహనాలకు సరఫరా చేసే సీఎన్జీ ధరను కంపెనీలు పెంచనున్నాయి. పెంచిన రేట్లను కంపెనీలు త్వరలోనే ప్రకటించనున్నాయి.

Leave a Reply