For Money

Business News

క్లీన్‌ సైన్స్‌ లిస్టింగ్‌ రోజే డబుల్‌

అందరూ జుమాటొ షేర్‌ కోసం పరుగులు తీశారు. నష్టాల కంపెనీ ఇష్యూ కోసం దరఖాస్తులు చేశారు. కాని రూ. 380 కోట్ల టర్నోవర్‌పై రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించే క్లీన్‌ సైన్స్‌కు కూడా ఆదరణ లభించింది. హంగామా లేకున్నా ఈ షేర్‌ 9 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ షేర్‌ లిస్టింగ్‌ రోజే ఇన్వెస్టర్ల పెట్టుబడి రెట్టింపు అయింది. ఈ కంపెనీ తన షేర్లను రూ. 900 ఆఫర్‌ చేయగా, లిస్టింగ్‌ రోజే ఈ షేర్‌ రూ. 1,784 వద్ద నిన్న లిస్టయింది. అంటే రెండు వారాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై 98 శాతం లాభం ఆర్జించారు.