For Money

Business News

పొరపాటున రూ.7,000 లక్షల కోట్లు బదిలీ

ఇంత ఖరీదైన పొరపాటు ఓ అంతర్జాతీయ బహుళజాతి బ్యాంకులో జరగడం విశేషం. సిటీ గ్రూప్‌ ఇన్‌కార్పొరేట్‌ బ్యాంక్‌లో ఓ ఉద్యోగి పొరపాటున 81 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 7000 లక్షల కోట్లు బదిలీ చేసేశారు. ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. ఓ కస్టమర్‌కు 280 డాలర్లు బదిలీ చేయాల్సి ఉండగా.. పొరపాటు 81 లక్షల డాలర్లు బదిలీ చేశాడు. దీంతో బ్యాంకు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ లావాదేవీ నిర్వహించిన ఇద్దరు ఉద్యోగులు జరిగిన పొరపాటు గుర్తించలేకపోయినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది. చివరికి మూడో ఉద్యోగి 90 నిమిషాలకు అంటే గంటన్నరకు గుర్తించారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌, ఆఫీస్‌ ఆఫ్‌ద కంప్ట్రోలర్‌ ఆఫ్‌ ద కరెన్సీకి పంపిన నివేదికలో ఈ ఘటనను పొరపాటున జరిగినట్లు సిటీ గ్రూప్‌ పేర్కొంది. వాస్తవానికి ఇంత పెద్ద లావాదేవీ వాస్తవానికి జరగి ఉండాల్సి కాదని… తమ డిటెక్టివ్‌ వ్యవస్థ దీన్ని వెంటనే గుర్తించిందని తెలిపింది. సిటీ లెడ్జర్‌ అకౌంట్స్‌ మధ్య డేటా నమోదు సమయంలో ఈ పొరపాటు జరిగిందని, సదరు లావాదేవీని రివర్స్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ వల్ల బ్యాంకుపై గాని, తమ క్లయింట్‌కు ఎలాంటి ప్రభావం చూపలేదని సిటీ గ్రూప్‌ పేర్కొంది. వంద కోట్ల డాలర్లు అంటే రూ. 8700 కోట్లకు మించి విలువైన పొరపాట్లు జరగడం ఈ బ్యాంకులో ఆనవాయితీలా కన్పిస్తోంది. ఇలాంటి ఘటనలు గత ఏడాది పది జరిగినట్లు బ్యాంక్‌ అంతర్గత నివేదికల ద్వారా తెలుస్తోందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. అంతకుమునుపు అంటే 2023తో పోలిస్తే 2024లో ఇలాంటి ఘటనలు తగ్గాయని ఆ పత్రిక వెల్లడించింది. 2023లో ఇలాంటి ‘నియర్‌ మిస్‌’ ఘటనలు 13 జరిగినట్లు పేర్కొంది. అమెరికా బ్యాంకింగ్‌ పరిశ్రమలు ఇలాంటి ఘటనలు జరగడం అరుదని ఆ పత్రిక పేర్కొంది.