పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు?
ఈ ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే మార్చి 14వ తేదీన పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. త్వరలోనే కొన్ని కీలక అసెంబ్లీలకు ఎన్నికలు ఉండటం, ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు బారీగా తగ్గడంతో… పెట్రోల్, డీజిల్ రే్ట్లను కేంద్రం తగ్గించే అవకాశముంది. వీటి ధరలను తగ్గించే అంశాన్ని వివిధ మంత్రిత్వ శాఖలు చర్చిస్తున్నట్లు ఇండియా టుడే పేర్కొంది. గత కొన్ని నెలలుగా క్రూడ్ బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 80 డాలర్ల మధ్య ఉంటోంది. ఇటీవల భారీగా తగ్గి 72 డాలర్లకు చేరింది. ఆసియా దేశాలకు తక్కువ ధరకు క్రూడ్ ఇచ్చేందుకు సౌదీ అరేబియా రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.