For Money

Business News

చెన్నై మెట్రో ఫేజ్‌ 2కు రూ. 63వేల కోట్లు

చెన్నై నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెంతుఉన్న నేపథ్యంలో ఆ నగంలో మెట్రో సెకండ్‌ ఫేజ్‌కు కేంద్ర కేబినెట్‌ ఇవాళ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. చెన్నై మెట్రో ఫేజ్‌ 2కు ఆమోదం కోరారు. ఇంతలోనే కేంద్రం సదరు ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 63,246 కోట్లు. 119 కిమీ సాగే ఈ ప్రాజెక్టులో మూడు కారిడార్లు ఉంటాయి. రోజూ 13 లక్షల ప్రయాణీకులను తీసుకెళ్ళే సామర్థ్యం ఈ ప్రాజెక్టు ఉంది. కేంద్రం, రాష్ట్రం సమాన వాటాతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. ఈ సమావేశంలో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, కృషోన్నతి యోజనకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.