తప్పుకున్న CEA కేవీ సుబ్రమణియన్
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తయినందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకిష్టమైన పరిశోధన, విద్యా బోధనకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రభుత్వంలో మూడేళ్లపాటు పనిచేసిన కాలంలో అద్భుతమైన ప్రోత్సాహం, మద్దతు లభించాయి. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, కీలక వ్యక్తులతోనూ స్నేహపూర్వక సంబంధాన్ని ఆస్వాదించాను. ఈ క్రమంలో దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు.