For Money

Business News

గూగుల్‌పై రూ. 1,338 కోట్ల ఫైన్‌

ఆల్ఫాబెట్‌ ఇన్‌కార్పొరేటెడ్‌కు చెందిన గూగుల్‌ సంస్థపై రూ. 1,338 కోట్ల (161.95 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధిస్తున్నట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్ల విషయంలో పోటీకి వీలు లేని గుత్తాధిపత్య ధోరణి అవలంబించినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు సీసీఐ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు తమ ఫోన్లలో సర్చ్‌ సర్వీసులు అందిస్తున్నందుకు బదులుగా వారికి గూగుల్‌ కంపెనీ ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదని సీసీఐ పేర్కొంది. మన దేశంలో 60 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉండగా, వీటిలో 97 శాతం ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే వాడుతున్నాయి. గూగుల్‌పై దేశంలో అనేక యాంటి ట్రస్ట్ కేసులు నమోదు అయ్యాయి.