For Money

Business News

52 వారాల గరిష్ఠ స్థాయికి కెనరా బ్యాంక్‌

బడ్జెట్‌ తరవాత మిడ్‌క్యాప్‌ బ్యాంక్‌ షేర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడిండి. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి చాలా వరకు బ్యాంక్‌ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఏయూ బ్యాంక్‌ మిడ్‌ క్యాప్‌లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇక బ్యాంక్‌ నిఫ్టి అన్ని షేర్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. అయితే కెనెరా బ్యాంక్ ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్‌ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.267.90ని తాకింది. ప్రస్తుతం ఈ ధర వద్దే ట్రేడవుతోంది. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో రూ. 124.30ని తాకిన షేర్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అక్టోబర్ నుంచి స్టాక్‌లో ర్యాలీ జోరుగా సాగింది. మధ్యలో లాభాల స్వీకరణ కారణంగా రూ.180 స్థాయిని తాకినా… మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో పరుగులు పెడుతోంది. బడ్జెట్ తర్వాత బ్యాంకు షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. నిన్న, ఇవాళ బ్యాంక్‌ షేర్లు ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ పీఎస్‌యూ, ప్రైవేట్‌ బ్యాంకులను ఇన్వెస్టర్లు భారీగా కొంటున్నారు. ఈ షేర్‌ మార్కెట్ కేపిటలైజేషన్ కూడా రూ.50వేలకోట్లకి దగ్గరవుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో షేర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.47581 కోట్లు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ షేర్ కేవలం అయిదు సెషన్లలోనే రూ.230 నుంచి రూ.269కి చేరింది.