For Money

Business News

వొడాఫోన్‌ కొనొచ్చా?

ఇవాళ భారీ లాభాల్లో ముగిసిన మూడు షేర్లలో వొడాఫోన్‌ ఐడియా, అదానీ టోటల్‌ గ్యాస్‌, ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ షేర్లు ఉన్నాయి. వొడాఫోన్‌ ఒక మోస్తరు లాభాలతో క్లోజ్‌ కాగా అదానీ టోటల్‌ 5 శాతంపైగా లాభపడింది. ఒక ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ ఏకంగా 20 శాతం పెరిగింది. ఈ షేర్లకు సంబంధించిన టెక్నికల్స్‌ను సెబీ వద్ద రిజస్టర్‌ అయిన హరిప్రసాద్‌ ఎకనామిక్‌ టైమ్స్‌తో పంచుకున్నారు.
నెట్‌వర్క్‌ విస్తరణ కోసం రూ. 30,000 కోట్ల డీల్‌ కుదుర్చుకున్న వొడాఫోన్‌ షేర్‌ ఇవాళ 7 శాతం దాకా పెరిగింది. ఈ షేర్‌ గత ఏడాదిగా సైడ్‌వేస్‌లో ట్రేడవుతోంది. ఈ షేర్‌ రానున్న వారాల్లో తొలి టార్గెట్‌ రూ. 16.5, రెండో టార్గెట్‌ రూ. 19.31 దిశగా పయనించే అవకాశముందని హరిప్రసాద్‌ అన్నారు.
అలాగే అదానీ టోటల్‌ గ్యాస్‌ ఇవాళ 8 శాతం దాకా అంటే రూ. 64లు పెరిగింది. 5 శాతంపైగా లాభంతో ఇవాళ క్లోజ్‌ అయింది. ఈ షేర్‌కు భారీ మద్దతు లభించడంతో 50 డీఎంఏని కూడా దాటింది. ఈ షేర్‌ తొలి టార్గెట్‌ రూ. 919, రెండో టార్గెట్‌ రూ. 998గా ట్రేడ్‌ చేయొచ్చని హరి ప్రసాద్‌ అన్నారు. ఇక మూడో షేర్‌ ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ కూడా రూ. 125 టార్గెట్‌ వైపు దూసుకెళుతోందని తెలిపారు. పడితే రూ. 95.5 వద్ద మద్దతు లభించవచ్చని తెలిపారు. తరువాతి మద్దతు స్థాయి రూ.90గా హరి ప్రసాద్‌ వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి ఈ కౌంటర్‌లో భారీ కొనుగోళ్ళ మద్దతు వచ్చిందని… షేర్‌ 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను దాటేసిందని ఆయన అన్నారు.

(ఈ సలహాలు టెక్నికల్స్‌ ఆధారంగా నిపుణులు ఇచ్చినవి. ఈ షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు మీ సొంత మనీ మేనేజర్‌తో సంప్రదించి తుది నిర్ణయం తీసుకోగలరు)

Leave a Reply