For Money

Business News

ఈవీలకు కేంద్రం అండ

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ‘పీఎం ఈ-డ్రైవ్‌’ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. దీని కోసం రూ.10,900 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ డ్రైవ్‌ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 88,500 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సాయం చేయనున్నారు. ఫేమ్‌ 1,2 పథకాల ద్వారా ఎలక్ట్రిక్‌ వామనాలకు మద్దతు ఇవ్వనున్నారు. ఈ రెండు పథకాల కింద ఇప్పటికే 16 లక్షల టూ వీలర్స్‌, త్రి వీలర్స్‌తో పాటు అంబులెన్స్‌లు, ట్రక్కులకు రాయితీల ద్వారా ఆర్థిక సాయం అందించారు. కొత్త పథకం కింద 14,028 కొత్త ఈ బస్సులకు ఆర్థిక మద్దతు ఇవ్వనున్నారు. ఇంకా టెస్టింగ్‌ కేంద్రాల అభివృద్ధితోపాటు ప్రమాణాల కొనసాగింపు, ఇతర సౌకర్యాలకు కూడా కేంద్రం మద్దతు ఇవ్వనుంది.

జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశంలోని 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు కలిగిన సీనియర్‌ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతో వీరికి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ. 70125 కోట్లను కేటాయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2024-25 నుంచి 2028-29 మధ్య కాలంలో ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు.

Leave a Reply