For Money

Business News

వ్యాక్యాలు మారుతాయి అంతే…

కేంద్ర ప్రభుత్వం తెచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టంలో కేవలం పదాలు, వ్యాక్యాలు మాత్రమే మారుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇపుడున్న చట్టంలోని ప్రొవిజన్స్‌ కేవలం పన్ను నిపుణులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్నాయని పేర్కొంది. పన్ను చట్టం సరళమైన భాషలో సామన్యులకు కూడా అర్థమయ్యే విధంగా మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త బిల్లును రేపు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదించనున్నారు. ఇదే బిల్లును వచ్చే వారం ఆమోదించనుంది. 60 ఏళ్ళ క్రితం తెచ్చిన ఐటీ చట్టం, 1961 స్థానంలో కొత్త బిల్లు తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కొత్త బిల్లులో కొత్తగా ఎలాంటి పన్నులు గానీ, అదనపు భారాలు గానీ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.