గ్యాస్ సబ్సిడీ కోసం రూ.22000 కోట్లు?
గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న ఎల్పీజీ గ్యాస్ ధరను మే నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడం లేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో తమ నష్టాలు పెరుగుతున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలియం శాఖను ఆశ్రయించారు. కంపెనీల తరఫున కాస్త సబ్సిడీ భారాన్ని మోయాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దాదాపు రూ.28000 కోట్ల సబ్సిడీని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరగా, ప్రభుత్వం రూ.22,000 కోట్ల సబ్సిడీ కోసం ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయింది. ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ సబ్సిడీ కేవలం ఇంటి అవసరాల కోసం సరఫరా చేస్తున్న గ్యాస్ కోసమే ఇస్తారు. పెట్రోల్, డిజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్షీణిస్తున్నందున.. కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరుసగా క్రూడ్ ధరలు తగ్గినా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు తగ్గించడం లేదు. పాత నష్టాల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గినా.. మన మార్కెట్లో ధరలు తగ్గడం లేదు.