For Money

Business News

టెలికాం ప్యాకేజీపై కేబినెట్‌ నిర్ణయం?

టెలికాం కంపెనీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్యాకేజీపై ఇవాళ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై మారటోరియం విధించే అంశంపై ఇవాళ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. నాలుగులేళ్ళ వరకు మారటోరియం విధిస్తారని వార్తలు వస్తున్నా… ఈ సమయంలో కూడా కంపెనీలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ సమయంలో వడ్డీని ప్రభుత్వ ఈక్విటీగా మార్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రతిపాదనపై వొడాఫోన్‌ ఆసక్తితో ఉంది.