జీ లర్న్పై బైజూ కన్ను?
జీ గ్రూప్ కంపెనీ అయిన జీ లెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుక బైజూస్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు కూడా జరిగినట్లు సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. అయితే ఈ వార్తలను జీ లర్న్ ఖండించింది. బైజూస్ మాత్రం స్పందించలేదు. ఇటీవల వరుసగా అనేక కంపెనీలను టేకోవర్ చేస్తున్న బైజూస్ తొలిసారి ఓ లిస్టెడ్ కంపెనీపై కన్నేసింది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న జీ గ్రూప్ కూడా ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టి ఇతర రంగాల నుంచి వైదొలగుతోందని మార్కెట్ ప్రచారం. కరోనా తరవాత స్కూల్ బిజినెస్ కూడా ఆటోపోట్లను ఎదుర్కొంటోంది. దేశంలో 110 చోట్ల 130 స్కూల్స్‌ను జీ లర్న్ నిర్వహిస్తోంది. కిడ్జి, అంకురం, మౌట్లిటెరా, హిమగిరి పేర్లతో స్కూల్స్‌ను నిర్వహిస్తోంది.