PSU బ్యాంకు షేర్లు కొనడం రిస్కే
ప్రస్తుత స్థాయిలో ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు కొనడం రిస్కే అని ప్రభుదాస్ లీలాదర్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ భట్ అన్నారు. ప్రతి చిన్న బ్యాంక్ షేర్ కూడా భారీగా పెరిగిందని… బ్యాంకింగ్ రంగంలోకి ఇటీవల వచ్చిన మార్పులన్నింటిని మార్కెట్ డిస్కౌంట్ చేసిందని ఆయన అన్నారు. పీఎస్యూ బ్యాంకు షేర్లలో ర్యాలీ శిఖరాగ్రంలో ఉందని.. ఇక్కడి నుంచి పెరగడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.ఒక నెలలోనే ఈ షేర్లు భారీగా పెరిగాయని.. తొందరపడి ఇపుడు కొనుగోలు చేయొద్దని ఆయన హెచ్చరించారు. దీర్ఘకాలంలో ఎస్బీఐ,కెనరా బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ బరోడా వంటి షేర్లు రాణిస్తాయేమో కాని.. ఇతర షేర్లను ఇపుడు కొనుగోలు చేయడం ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇపుడు కొంటే పెద్దగా ప్రతిఫలాలు అందే ఛాన్స్ లేదని.. పైగా రిస్క్ ఉందని ఆయన హెచ్చరించారు.