For Money

Business News

మీ రిస్క్‌ను బట్టి ఈ షేర్లు కొనండి

ఈటీ నౌ ఛానల్‌ ప్రేక్షకుల కోసం నూరేష్‌ మేరాని మూడు షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు. ఇది టెక్నికల్‌ సలహా మాత్రమే. తుది నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక షేర్ల విషయానికొస్తే…
తక్కువ రిస్క్‌….
రిస్క్‌ ఎక్కువ అక్కర్లేదు… ఒక మోస్తరు ప్రతిఫలం చాలు అనేవారికి నూరేష్‌ రెమెండ్‌ చేస్తున్న షేర్‌ టాటా పవర్‌. ఈ షేర్‌ నిన్న రూ.251.90 వద్ద ముగిసింది. టార్గెట్‌ రూ.280. స్టాప్‌లాస్‌ రూ. 244. మార్కెట్‌ క్షీణించినపుడు కొనేందుకు ప్రయత్నించండి.
ఒక మోస్తరు రిస్క్‌
మరీ అధిక రిస్క్‌ కాకుండా… ఒక మోస్తరు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు ఆర్‌బీఎల్ బ్యాంక్‌ను కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు నూరేష్‌. ఈ షేర్‌ నిన్న రూ. 141.35 వద్ద ముగిసింది. రూ.135 స్టాప్‌లాస్‌తో రూ. 170 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు.
అధిక రిస్క్‌…
మంచి ప్రతిఫలం కోసం… అధిక రిస్క్‌ తీసుకోవడానికి రెడీగా ఉన్నవారు డీసీబీ బ్యాంక్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ షేర్‌ నిన్న రూ.74.15 వద్ద ముగిసింది. రూ. 70 స్టాప్‌లాస్‌తో రూ. 90 టార్గెట్‌ కోసం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చు.