నిఫ్టి: పడితే కొనొచ్చా…
అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్ కుప్పకూలగా… ఇవాళ జపాన్ నిక్కీ 3 శాతం క్షీణించింది. ఇతర ఆసియా మార్కెట్లలో కూడా అదే ట్రెండ్ కన్పిస్తోంది. అయితే మన మార్కెట్లలో ఇవాళ అమ్మకాల జోరు భారీ స్థాయిలో ఉండకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా నిఫ్టి పడినపుడు కొనుగోలు చేయొచ్చని.. అయితే స్టాప్‌లాస్ కచ్చితంగా పాటించాలని అంటున్నారు. నిఫ్టి 24,710 లేదా 24,550 స్థాయికి పడే అవకాశముందని ఇండిపెండెంట్ అనలిస్ట్ రవి నథాని అంటున్నారు. ఈ రెండు స్థాయిల వద్ద నిఫ్టికి గట్టి మద్దతు ఉందని. ఆ స్థాయికి చేరే వరకు వెయిట్ చేయాలని అన్నారు. ఈ స్థాయిల నుంచి కోలుకుంటే నిఫ్టి 25000 స్థాయిని తొలుత అధిగమించే అవకాశముందని తెలిపారు. ఆ తరవాత 25,333 వరకు పెరిగే అవకాశముందని అన్నారు. ఓవరాల్ ట్రెండ్ బుల్లిష్‌గా ఉందని, మధ్య ఇలాంటి చిన్న చిన్న పుల్‌బ్యాక్స్ సహజమేనని రవి నథాని అంటున్నారు. ఇక నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ కూడా ఇపుడు పరిమిత స్థాయిలో కదలాడుతోందని… 12980 స్థాయిని కోల్పోతే బేరిష్ ట్రెండ్ ప్రారంభమౌతుందని అన్నారు. ఆ దిగువన 12880, 12750 లేదా 12615 ప్రాంతాల్లో నిఫ్టి మిడ్ క్యాప్‌కు మద్దతు లభించవచ్చి అన్నారు.