For Money

Business News

NIFTY TRADE: మళ్ళీ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు

మూడు రోజుల కొనుగోళ్ళ తరవాత విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మారు. నిన్న ఒక్కరోజు రూ. 1926 కోట్లు అమ్మారు. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో రూ.9885 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే నిఫ్టికి తొలి ప్రతిఘటన 17781 వద్ద, రెండో ప్రతిఘటన 17842 వద్ద ఎదురవుతుందని వీరేందర్‌ అంచనా వేస్తున్నారు. ఇంకా పెరిగితే 17876కు, తరవాత 17907ని తాకొచ్చు. అయితే ఓపెనింగ్‌లో కాకుండా మద్దతు స్థాయిలో కొనడం మంచిది. ఇక డే ట్రేడర్స్‌ మద్దతు స్థాయి 17705 వద్ద అంద వచ్చు లేదా 17665 వద్ద. బ్యాంక్‌ నిఫ్టి బలహీనపడే వరకు నిఫ్టిలో షార్ట్‌ చేయడం అనవసరమని వీరేందర్‌ అంటున్నారు. దిగువ స్థాయిలో కొనడం మంచిదని ఆయన సలహా. బ్యాంక్‌ నిఫ్టి, ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడండి.