NIFTY TRADE: బై సిగ్నల్ ఉన్నా…
నిఫ్టి అప్‌ట్రెండ్ జోరుగా ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 16,529. ఆసియా మార్కెట్ల తీరు చూస్తుంటే నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి లెవల్స్ చూడటానికి ముందే టెక్నిల్ అంశాలను చూద్దాం. పొజిషనల్, షార్ట్ టర్మ్‌కు టెక్నికల్స్ బై సిగ్నల్స్ ఇస్తున్నాయి. అయితే నిఫ్టి ఇప్పటికే ఓవర్‌బాట్ పొజిషనల్లో ఉంది. కాబట్టి నిఫ్టి పడితే కొనుగోలు ఆసక్తి రావొచ్చు. నిఫ్టి 16,480పైన ఉన్నంత వరకు ఢోకా లేదు. నిఫ్టి తొలుత ఈ స్థాయికి వస్తుందా లేదా తొలి ప్రతిఘటన స్థాయికి చేరుతుందా అనేది చూడాలి. నిఫ్టికి తొలి ప్రతిఘటన స్థాయి 16,577, ఈ స్థాయి దాటితే 16,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది. నిఫ్టి ఓవర్ బాట్లో ఉన్నందున… నిఫ్టి పడే వరకు ఆగడం మంచిది. నిఫ్టి పెరిగి తొలి లేదా రెండో ప్రతిఘటన స్థాయి వద్ద అమ్మడం బెటర్. 15-20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో ప్రతిఘటన స్థాయిలో అమ్మొచ్చు. నిఫ్టికి 16,460 లేదా 16400 ప్రాంతంలో కొనుగోళ్ళ మద్దతు లభించవచ్చు. నిఫ్టి పడే వరకు ఆగడం మంచిది. అధిక స్థాయిలో కొనుగోలు చేయడం అనవసరం.