డే ట్రేడింగ్… పడితే కొనండి
ఇవాళ్టికి మాత్రం నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని సలహా ఇచ్చారు. దీర్ఘకాలిక ట్రెండ్ గురించి సుఖాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇవాళ్టికి మాత్రం పడితే కొనుగోలు చేయాలని, అయితే కనీసం 100 పాయింట్లు స్టాప్‌లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయాలని ఆయన సూచించారు. ఐటీ కంపెనీల పనితీరు గురించి ఆయన మాట్లాడుతూ… ఇవాళ్టికి మాత్రం అంటే డే ట్రేడింగ్ కోసం ఇన్ఫోసిస్ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఇన్వెస్టర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లను పరిశీలించవచ్చని ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. గరిష్ఠ స్థాయి నుంచి ఈ షేర్లు 30 శాతం దాకా క్షీణించాయని ఆయన అన్నారు. మళ్ళీ ఈ స్థాయిలో ఈ షేర్లు దొరకవని ఆయన సూచించారు.