For Money

Business News

బంగారం : పడితే కొనండి

ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ఇవాళ రూ. 54807 వద్ద ట్రేడవుతోంది. ఉదయం రూ. 54720 వద్ద ప్రారంభమైనా వెంటనే రూ. 54,706ని తాకింది. తరవాత రూ. 54835ని తాకిన గట్టి ఒత్తిడి వస్తోంది. ప్రస్తుత నిఫ్టి అత్యంత కీలక స్థాయిలో ఉంది. ఇరువైపులా కదలాడే ఛాన్స్‌ ఉంది. రూర. 54523 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయాలని.. పెరిగితే రూ. 54998 లేదా 55049 మధ్య అమ్మొచ్చని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అయితే రూ. 55,127 దాటితే మాత్రం ర్యాలీ రావొచ్చు. కాబట్టి అమ్మేవారు రూ. 55120ను స్టాప్‌లాస్‌గా ఉంచుకోవచ్చు. అలాగే దిగువస్థాయిలో రూ. 54523 ప్రాంతంలో కొనేవారు రూ. 54472ని స్టాప్‌లాస్‌తో పెట్టుకుని ట్రేడ్‌ చేయండి.

స్పాట్‌ మార్కెట్‌లో ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అంటే డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లో ఆర్నమెంట్‌ అంటే 22 క్యారట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,050 కాగా స్టాండర్డ్‌ బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,600గా ఉంది.