For Money

Business News

వీక్లీ బెట్స్‌: భాసిన్‌ నుంచి మూడు షేర్లు

ఇవాళ డిసెంబర్‌ నెల, వీక్లీ డెరివేటివ్స్‌ ఎక్స్‌పెయిరీ. నిఫ్టి 18000 ప్రాంతంలో ఉన్నా అనేక షేర్లు పడుతున్నాయి. 18000 ప్రాంతంలో కోటికిపై కాల్‌, పుల్‌ రైటింగ్‌ ఉంది. దీంతో ఈ స్థాయిని నిఫ్టి కాపాడుకోవచ్చు.. కాని షేర్లు మాత్రం పడుతున్నాయి. రేపటి నుంచి కొత్త డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ ప్రారంభం కానున్నాయి. దీంతో వచ్చే వారంలో ఆకర్షణీయ లాభాలు ఇచ్చే మూడు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ సిఫారసు చేస్తున్నారు. వారంలోగా టార్గెట్‌ను తాకుతాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే షేర్ల స్టాప్లాస్‌ కూడా గమనించండి.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌
ప్రస్తుత ధర : రూ.6985
టార్గెట్‌ : రూ. 7500
స్టాప్‌ లాస్‌ : రూ. 6800

బజాజ్‌ ఫైనాన్స్‌
ప్రస్తుత ధర : రూ. 6409
టార్గెట్‌ : రూ. 6950/రూ. 7000
స్టాప్‌ లాస్‌ : రూ. 62225

గుజరాత్ గ్యాస్‌
ప్రస్తుత ధర : రూ. 475.30
టార్గెట్‌ : రూ. రూ. 500
స్టాప్‌ లాస్‌ : రూ. 461