Motilal Oswal: ‘బర్జర్ కింగ్’ కొనండి
బర్జర్ కింగ్ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా బ్రోకరేజీ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ సిఫారసు చేస్తోంది. ఈ కంపెనీ పనితీరును విశ్లేషించిన మోతీలాల్ బర్జర్ కింగ్ షేర్ ధర కనీసం 50 శాతం పెరిగే అవకాశముందని అన్నారు. బర్జర్ కింగ్ నిర్వహిస్తున్న రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్ షేర్ ఇపుడు రూ. 99.45 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఈ షేర్ క్రితం ముగింపు రూ. 96.8. ఈ రంగంలోని ప్రధాన కంపెనీలతో పోలిస్తే ఈ షేర్ చాలా డిస్కౌంట్‌తో ట్రేడవుతోందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. కంపెనీ టర్నోవర్ కోవిడ్ పూర్వ స్థితికి వచ్చేసిందని అన్నారు. ఇంకా కంపెనీకి చెందిన సగం షాప్‌లు మల్టిప్లెక్స్‌లలో ఉన్నాయని తెలిపింది. మాల్స్ వ్యాపారాలు మునుపటి స్థాయికి చేరితే బర్జర్ కింగ్ వ్యాపారం భారీగా పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. వచ్చే మార్చికల్లా మరో 73 బర్జర్ కింగ్స్ కెఫేలను కంపెనీ ప్రారంభించనుందని తెలిపింది. ప్రస్తుతం ఈ షేర్ టార్గెట్ రూ.150గా పేర్కొంది.