NIFTY TRADE: పడితే కొనుగోలు చేయొచ్చా?
నిఫ్టి ఇవాళ పడితే దిగువస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలని సీఎన్‌బీసీ ఆవాజ్ విశ్లేషకుడు వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. 18000 పుట్ ఆప్షన్స్‌ను చూస్తే మార్కెట్ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. కాబట్టి నిఫ్టి పడితే కొనుగోలు చేసేందుకు తాను రెడీ అని ఆయన అంటున్నారు. ఇక ఆయన చెప్పే లెవల్స్ …17820 లేదా 17781 ప్రాంతానికి నిఫ్టి వచ్చే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆయన సలహా ప్రకారం దిగువ స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి గనుక ఇంకా పడితే 17744, 17705 స్థాయిల వద్ద మద్దతు అందే అవకాశముందని ఆయన అంటున్నారు. డిప్ వచ్చే వరకు ఆగి కొనడం బెటర్. ఇక బ్యాంక్ నిఫ్టి లెవల్స్‌కు సంబంధించిన లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=kRaf2azPfSg