బులియన్ డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా డాలర్ విలువ మళ్ళీ పెరగడంతో బులియన్లో ఒత్తిడి పెరుగుతోంది. నిన్న రాత్రి ఫ్యూచర్స్ మార్కెట్లోవెండి రూ.550లు పెరిగినా ఇవాళ నష్టాల్లో ప్రారంభం కానుంది. దీనికి కారణంగా అమెరికా మార్కెట్లో డాలర్ పెరగడమే. ఔన్స్ బంగారం ధర మళ్లీ 1830 డాలర్లకు పడగా, వెండి ధర 20.48కి క్షీణించింది. దీంతో ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్లో బులియన్ నష్టాల్లో ప్రారంభం కావొచ్చు. ఇక స్పాట్ మార్కెట్ల హైదరాబాద్ మార్కెట్లో బంగారం నిలకడగా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 క్షీణించింది. దీంతో ఈ రేటు రూ. 47,650కు దిగి వచ్చింది. అలాగే 24 క్యారెట్ల స్టాండర్డ్ బంగారం ధర రూ. 51,980కు తగ్గింది. ఇక వెండి స్పాట్ మార్కెట్లో రూ. 100 పెరగ్గా, ఫ్యూచర్స్ మార్కెట్లో రూ. 550 పెరిగింది.
విదేశీ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో బంగారంలో ఒత్తిడి పెరుగుతోంది. బంగారం ధరకు కీలక స్థాయి
1830 స్థాయికి పడిపోయింది. ఇది అత్యంత కీలక స్థాయి. బంగారం ధర 1830 డాలర్ల స్థాయి వద్ద మద్దతు తీసుకుంటే.. తర్వాత 1843 డాలర్ల వద్ద కాత్త ఒత్తిడి రావొచ్చు. ఈ స్థాయి దాటితే టార్గెట్ 1860 డాలర్ల స్థాయికి వెళుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా డాలర్ కదలికలను బట్టి ఉంటుంది. అదే వెండి కరెన్సీతో పాటు పారిశ్రామికవృద్ధికి స్పందిస్తుంది. డాలర్ పెరిగినా… ఆర్థిక వృద్ధి అవకాశాలు పెరిగితే వెండికి మద్దతు లభిస్తుంది.