For Money

Business News

ఇవాళ బంగారం, వెండి ధరలు

బులియన్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో బంగారం ధర అధికంగా ఉంద. ఢిల్లీలో స్టాండర్డ్‌ బంగారం ధర పది గ్రాములకు రూ. 51100 కాగా, ఆర్నమెంట్‌ ధర రూ. 46,850. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ.48,760కాగా, కిలో వెండి ధర రూ.60,800. ఆర్నమెంట్‌ బంగారం ధర రూ. 44800. ఇక విజయవాడలో బంగారం ధర రూ.48,760కాగా, కిలో వెండి ధర రూ.60,800. ప్రొద్దుటూరులో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ.48,760కాగా, కిలో వెండి ధర రూ.60,800 వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,820 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 23.87 డాలర్లుగా ఉంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ కాస్త బలహీనంగా ఉండటమే దీనికి కారణం.