భారీగా పెరిగిన బులియన్
అంతర్జాతీయ మార్కెట్ బులియన్ ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. వెండి మూడు శాతం పెరిగింది. అమెరికా మార్కెట్లో బంగారానికి 1756 డాలర్ల ప్రాంతంలో గట్టి మద్దతు అందుతోంది. ఈ స్థాయికి వచ్చిన ప్రతిసారీ నిలబడుతోంది. అక్కడి నుంచి కోలుకుని దాదాపు 1800 డాలర్లకు చేరింది. ఇవాళ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ విలువ 0.35 శాతం క్షీణించింది. దీంతో ఎంసీఎక్స్ బంగారం (డిసెంబర్ కాంట్రాక్ట్) రూ.750 పెరిగి రూ.47,948లకు చేరింది. అలాగే వెండి కూడా రెండున్నర శాతం వరకు పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం రూ. 1,381 పెరిగి రూ. 62,967కి చేరింది.