వెండి, బంగారం ఢమాల్
మార్చిలో వడ్డీ రేట్లను పెంచాలని ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో డాలర్ అనూహ్యంగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ ఏకంగా 97ను దాటేసింది. డాలర్ భారీగా పెరగడంతో… దీని ప్రభావం బులియన్‌పై తీవ్రంగా పడింది. బంగారం కంటే వెండి బాగా నష్టపోయింది. అమెరికా మార్కెట్లోబంగారం ఔన్స్ ధర 1.8 శాతం క్షీణించి 1797 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో వెండి మాత్రం 4.85 శాతం క్షీణించి 22.64 డాలర్లకు పతనమైంది.
మన మార్కెట్లో…
డాలర్ భారీగా పెరగడంతో బులియన్ ధరలు మన దగ్గర కాస్త తక్కువగా పడ్డాయని భావించాలి. ఎంసీఎక్స్ కమాడిటీ మార్కెట్ ఫ్యూచర్స్‌లో పది గ్రాముల బంగారం (ఫిబ్రవరి కాంట్రాక్ట్) రూ. 848 క్షీణించి రూ.48,003 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి మార్చి కాంట్రాక్ట్ రూ.2230 తగ్గి రూ. 61,841 వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ మార్కెట్లో హైదరాబాద్‌లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ. 460 తగ్గి రూ. 49640 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రూ. 400 తగ్గి రూ. 45500 వద్ద ట్రేడవుతోంది.