కొత్త లోగో వచ్చేసింది
సమీప భవిష్యత్తులో టారిఫ్లు పెంచే లేదని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేర్కొంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల వరుసగా టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందే. తమ కస్టమర్ల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమ ప్రధాన లక్ష్యమని ఆదాయం కాదని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి అన్నారు. ఆలస్యంగానైనా సరే 5జీ సేవలను కంపెనీ అందుబాటులోకి తేనుంది. ఈనేపథ్యంలో కంపెనీ లోగోను మార్చారు. కాషాయ రంగు డామినేట్ చేసేలా కొత్త లోగో ఉండటం విశేషం. మొత్తానికి లోగోలో త్రివర్ణ పతాక రంగులు వచ్చేలా చూశారు.