బ్యాంకెక్స్‌కు గుడ్‌బై
సెబీ ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనల మేరకు బీఎస్‌ఈ ఇక నుంచి ఒకే ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్‌ను కొనసాగించనుంది. ప్రస్తుతం బీఎస్‌ఈ ఎఫ్ అండ్ ఓ డెరివేటివ్స్‌లో మూడు కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. వీటిలో సెన్సెక్స్ 50, బ్యాంకెక్స్‌లను ఆపివేయాలని బీఎస్‌ఈ నిర్ణయించింది. నవంబర్ 14వ తేదీ నుంచి బీఎస్‌ఈలో సెన్సెక్స్ 50 వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్ ఉండవు. ఈ తేదీ తరవాత కొత్త కాంట్రాక్ట్‌లను జనరేట్ చేయరు. ఇప్పటికే ఉన్న కాంట్రాక్ట్‌లను మాత్రం కొనసాగిస్తారు. అలాగే నవంబర్ 18వ తేదీ నుంచి బ్యాంకెక్స్‌లో వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఉండవు. ఆ తరవాత కొత్త కాంట్రాక్ట్‌లను జనరేట్ చేయరు. ఇప్పటికే ఉన్న కాంట్రాక్ట్‌లను మాత్రం గడువు వరకు కొనసాగిస్తారు. దీంతో ఇక నుంఇచ బీఎస్‌ఈలో కేవలం సెన్సెక్స్ 30 వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు మాత్రమే ఉంటాయి. ఈ సూచీ 30 బ్లూచిప్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.