For Money

Business News

డెరివేటివ్స్‌లోనూ ప్రి ఓపెన్‌

ఇప్పటి వరకు స్టాక్‌ మార్కెట్లలో సాధారణ ఈక్విటీ షేర్లకు మాత్రమే ప్రి ఓపెన్‌ మార్కెట్‌ ఉంది. ఉదయం 9 గంటల నుంచి 9.15 గంటల వరకు ప్రి మార్కెట్‌ ఉంటుంది. అయితే తొలి 8 నిమిషాల్లో మాత్రమే ఆర్డర్లు పెట్టేందుకు, ధరలు పెట్టేందుకు అనుమతిస్తారు. అలాగే ఇదే సమయంలో ఆర్డర్లను మార్చడం లేదా క్యాన్సిల్‌ చేయొచ్చు. దీనివల్ల ఏయే ధరల వద్ద ఫలానా షేర్‌ ట్రేడ్‌ ప్రారంభమౌతుందో చూచాయగా వెల్లడి అవుతుంది. అయితే డిసెంబర్‌ 8వ తేదీ నుంచి డెరివేటివ్స్‌ విభాగంలో కూడా ప్రి ఓపెన్‌ మార్కెట్‌ నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ వెల్లడించింది. సెబి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Leave a Reply