ఈ షేర్ ధర 60 శాతం తగ్గుతుంది
ఇండియా సిమెంట్ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని స్ప్రింగ్‌వే మైనింగ్‌ను జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు ఇండియా సిమెంట్ అమ్మేసిన విషయం తెలిసిందే. స్ప్రింగ్‌వే గనులకు 2018లో ఇండియా సిమెంట్స్ రూ. 182 కోట్లకు కొనుగోలు చేసింది. ఇపుడ అవే గనులను రూ. 477 కోట్లకు విక్రయించింది. డీల్‌లో భాగంగా తొలుత రూ. 373 కోట్లు, తరవాత రూ. 103 కోట్లు ఇండియా సిమెంట్‌కు రానున్నాయి. ఇండియా సిమెంట్‌లో డీమార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమాని, ఆయన సోదరునికి 20.8 శాతం వాటా ఉంది. ఈ షేర్ వ్యాల్యూయేషన్ మరీ అధికంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇండియా సిమెంట్ మరో సిమెంట్ దిగ్గజం టేకోవర్ చేస్తుందన్న వదంతులతో ఈ షేర్ ధర భారీగా పెరిగింది. ఇవాళ 12 శాతం తగ్గి రూ. 242.95కు చేరింది. గనులు అమ్మేయడం వల్ల ఇండియా సిమెంట్ ఇక విస్తరణ ఉండదని మార్కెట్ భావిస్తోంది. నువామా రీసెర్చి సంస్థ ఇండియా సిమెంట్ షేర్ ధర టార్గెట్‌ను రూ. 112కు తగ్గింది. అంటే ఇపుడున్న ధర నుంచి 60 శాతం తగ్గుతుందన్నమాట. మోతీలాల్ ఓస్వాల్ కూడా ఇండియా సిమెంట్ విస్తరణపై అనుమానం వ్యక్తం చేసింది.ఈ బ్రోకరేజీ సంస్థ కూడా ఈ షేర్ టార్గెట్ ధరను రూ. 180కి తగ్గించింది. ఇక ఎస్ సెక్యూరిటీస్ కూడా ఈ కంపెనీ షేర్ టార్గెట్ ధరను రూ. 146కు తగ్గించింది. అంటే మరో 47 శాతం కోత తప్పదన్నమాట.