వాల్‌స్ట్రీట్‌కు AI షాక్
అనలిస్టులు భయపడిందే జరుగుతోందా? గత శుక్రవారం వాల్‌స్ట్రీట్ స్పందన దీన్నే రూఢి చేస్తోంది. AI రంగానికి చెందిన షేర్లు డల్‌గా ఉంటున్నాయి. మార్కెట్ అంచనాలను వాటి పనితీరు అందుకోవడం లేదు. ఒరాకిల్ ఇచ్చిన ఫలితాలతో వాల్‌స్ట్రీట్ షాక్ తింది. ఏకంగా 14 శాతం క్షీణించింది. ఆ తరవాత కూడా ఆ షేర్ బలహీనంగా ఉంది. ఇక గత శుక్రవారం బ్రాడ్‌కామ్ ప్రకటించిన ఫలితాలు కూడా మార్కెట్‌ను నిరాశపర్చింది. షేర్ 12 శాతం పైగా నష్టపోయింది. ఈ షేర్‌తో పాటు శుక్రవారం ఎన్వీడియా, ఒరాకిల్‌తో పాటు పలు AI రంగ సంబంధ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీని ప్రభావం మన మార్కెట్లపై ఏ మాత్రం ఉంటుందో చూడాలి. ఇవాళ గిఫ్ట్‌నిఫ్టి ఇప్పటికే 90 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది.
