హాస్పిటాలిటీ షేర్లకు భలే డిమాండ్
దేశంలో కరోనా కేసులు నామమాత్రమే కావడంతో హాస్పిటాలిటీ రంగానికి చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతోంది. హోటల్స్ చైన్స్, విశ్రాంతి గృహాలు, రిసార్ట్లు, ఏవియేషన్, టూర్ ఆపరేట్లకు చెందిన కంపెనీ షేర్లు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి అనేక షేర్లు ఆకర్షణీయ లాభాలతోట్రేడవుతున్నాయి. నిన్న ఆరంభంలో రూ. 62 ఉన్న లెమన్ట్రీ షేర్ ఇశాళ రూ.69ని తాకింది. నిన్న హోటల్ రంగానికి చెందిన అద్వానీ హోటల్స్ అండ్ రిసార్ట్స్ షేర్ 6.5 శాతం, ఈఐహెచ్ లిమిటెడ్ షేర్ 6.4 శాతం, ఈఐహెచ్ అసోసియేటెడ్ హోటల్స్ షేర్ 12 శాతం, ఇండియన్ హోటల్స్ రెండు శాతం మేర పెరిగాయి. ఇక ఏషియన్ హోటల్స్ (ఈస్ట్) 16 శాతం, ఏషియన్ హోటల్స్ (నార్త్) షేర్లు దాదాపు 5 శాతం వరకు పెరిగాయి. జీవీకే హోటల్స్ షేర్ కూడా 5.7 శాతం పెరిగింది. దాదాపు రెండేళ్ళ తరవాత ఈ షేర్లలో భారీ కదలిక వచ్చింది. ఇక ఏవియేషన్ రంగానిక ఇచెందిన ఇంటర్ గ్లోబ్, స్పైస్ జెటతో పాటు టూర్ ఆపరేటర్ థామస్ కుక్ షేర్ కూడా నాలుగు శాతం వరకు పెరిగాయి. ఈ పరిశ్రమలో విస్తరణ వెంటనే సాధ్యం కాదని, నిర్మాణ ఖర్చు భారీగా పెరిగినందున… ఈ ఖర్చు తగ్గే వరకు కొత్తగా ఎవరూ ప్రాజెక్టులు చేపట్టరని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. మరో నాలుగైదు ఏళ్ళ తరవాత కొత్తగా హోటల్స్, రిసార్ట్స్ అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఈలోగా హోటల్స్, రిసార్ట్స్ చార్జీలు రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వీరు చెబుతున్నారు. టూర్లకు జనం బాగా మక్కువ చూపుతున్నారని… డబ్బును పట్టించుకోవడం లేదని అంటున్నారు. సమీప భవిష్యత్తులో
EIH లిమిటెడ్, ఇండియన్ హోటల్స్, EIH అసోసియేట్స్, లెమన్ ట్రీ హోటల్స్, చాలెట్ హోటల్స్, మహీంద్రా హాలిడేస్ & రిసార్ట్స్, తాజ్ జీబీకే కంపెనీల షేర్లు ఆకర్షణీయ లాభలు గడించే అవకాశముందని అంటున్నారు.