For Money

Business News

జెట్‌ స్పీడుతో క్రూడ్‌ ఆయిల్‌

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వేసిన అంచనా త్వరలోనే నిజం కానుంది. బ్యారెల్‌ క్రూడ్‌ ధర 90 డాలర్లు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవాళ డాలర్‌ బలహీనపడటం, ఒపెక్‌ దేశాల సమావేశం ఉండటంతో క్రూడ్‌ ఆయిల్‌ ఏకంగా మూడు శాం పెరిగింది. పలు మాల్లు 80 డాలర్లకు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిన బ్రెంట్‌ క్రూడ్‌ ఇవాళ 81.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది భారత్‌ వంటి వర్ధమాన దేశాలు వాడే క్రూడ్‌. ఇక అమెరికాలో వాడే WTI క్రూడ్‌ కూడా 78 డాలర్లను దాటింది. డాలర్‌ పతనం కారణంగా బులియన్‌ లో పెద్ద మార్పులు లేవు. దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతున్నాయి.