For Money

Business News

70 డాలర్ల దిగువకు బ్రెంట్‌

క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్‌లో పతనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సెషన్స్‌ను తగ్గుతూ వచ్చిన క్రూడ్‌ ఇవాళ 2021 తరవాతఅంటే మూడేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇవాళ క్రూడ్‌ ధరలుఏ నాలుగు శాతం దాకా క్షీణించాయి. 2024లో క్రూడ్‌కు డిమాండ్‌ తక్కువగా ఉండొచ్చని ఒపెక్‌ దేశాల ఇచ్చిన నివేదిక.. మార్కెట్‌ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అమెరికా మార్కెట్‌లో విక్రయించే WTI క్రూడ్‌ బ్యారెల్‌ ధర 66 డాలర్లకు క్షీణించగా, ఆసియా దేశాల కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్‌ ధర 69.4 డారల్లకు పడిపోయింది. కరెన్సీ మార్కెట్‌లో నిన్న, నేడు కూడా డాలర్ ఇండెక్స్‌ గ్రీన్‌లో ఉండటంతో క్రూడ్‌ ధరల పతనం జోరుగా ఉంది.