భారత మార్కెట్లకు శుభవార్త!
ఈనెల డెరివేటివ్స్ సిరీస్ ప్రారంభం నుంచి భారత మార్కెట్‌ను పశ్చిమాసియా యుద్ధం భయపెడుతోంది. మార్కెట్ భారీగా నష్టపోయింది. అక్టోబర్ సిరీస్‌లో ఇవాళ మార్కెట్ లాభాలతో ముగిశాయి. దాదాపు 25,000 స్థాయి లోపునకు పడిపోయిన నిఫ్టి 24500 తాకుతుందా అన్న టెన్షన్‌ను కల్గించింది. అక్కడి నుంచి కోలుకుని ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెయింట్ కంపెనీలతో పాటు టైర్ తయారీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా నష్టపోయాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఆయిల్ సరఫరాకు ఢోకా ఉండదని తేలడం, ముఖ్యంగా ఇజ్రాయిల్‌తో చర్చలకు హెజ్‌బొల్లా సిద్ధం కావడంతో ముడి చమురు మార్కెట్‌లో ధరలు పతనం కావడం ప్రారంభమైంది. బ్రెంట్ క్రూడ్‌తో పాటు WTI క్రూడ్ ధరలు కూడా 5 శాతం దాకా క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ కొద్దిసేపటి క్రితం 76.86 డారల్లకు పడిపోయింది. నిన్న బ్యారెట్ బ్రెంట్ ధర 80.50 డాలర్లు పలికిన విషయం తెలిసిందే. WTI క్రూడ్ కూడా 5 శాతం వరకు క్షీణించింది. మరోవైపు వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ఉంది. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్ల సూచీ నాస్‌డాక్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఇవాళ కూడా మన మార్కెట్‌లో ఐటీ షేర్లు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఈ కౌంటర్లలో రేపు కూడా ర్యాలీకి ఛాన్స్ ఉంది. మరోవైపు చమురు ఆధార పరిశ్రమల షేర్లు కూడా రేపు రాణించే ఛాన్స్ ఉంది.