NIFTY TRADE: లాభాలు స్వీకరించండి
ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే లాభాలను స్వీకరించాల్సిందిగా డేటా అనలిస్ట్ వీరేందర్ సలహా ఇస్తున్నారు. గత కొన్ని రోజలుగా బై ఆన్ డిప్‌ను సిఫారసు చేసిన వీరేందర్ ఇవాళ ఇన్వెస్టర్ల తమ పొజిషన్స్‌లో కనీసం 70 శాతం లాభాలు స్వీకరించమని సలహా ఇస్తున్నారు. నిఫ్టి 17300 దాటుతుందా లేదా 17500లకు చేరుతుందా అన్న అంశాలు తరవాత మాట్లాడుకోవచ్చని… ఇవాళ్టికి మాత్రం పాక్షిక లాభాలు స్వీకరించడం ఉత్తమని సలహా ఇస్తున్నారు. ఇక ఇవాళ్టి లెవల్స్ నిఫ్టికి తొలి ప్రతిఘటన 17210 లేదా 17271 వద్ద ఎదురుకానుంది. లేదంటే 17331 -17381 వద్ద ఎదురు కావొచ్చని వీరేందర్ అంటున్నారు. ఇక దిగువ స్థాయిలో 17210 లేదా 17166 వద్ద మద్దతు లభించనుంది. లేదంటే 17110 లేదా 17050 వద్ద మద్దతు అందే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టి, ఇతర లెవల్స్ కోసం వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=7C6PKB-RFc0