For Money

Business News

NIFTY TRADE: లాభాలు స్వీకరించండి

మార్కెట్‌లో ఇప్పటికే షార్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు ఇవాళ నిఫ్టి గనుక మరింత క్షీణిస్తే 17150 ప్రాంతంలో లాభాలు స్వీకరించమని అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నారు. కాల్‌ రైటింగ్‌ 17300 వద్ద చాలా అధికంగా ఉందని, పుట్‌ రైటింగ్‌ పెద్దగా లేనందే… నిఫ్టి గనుక 17300పైన బలంగా ముందుకు సాగితే… షార్ట్‌ కవరింగ్‌ కూడా వచ్చే అవకావముందని అన్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు 17300 ప్రాంతంలో నిఫ్టి కదలికలను గమనించమని వీరేందర్‌కుమార్‌ సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఇపుడు ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉన్నందున నిఫ్టి కోలుకోవచ్చని ఆయన అంటున్నారు. నిఫ్టి పెరిగితే 17308, 17362 ప్రాంతాల్లో ప్రతిఘటన వచ్చే అవకాశముంది. ఈ స్థాయి దాటితే నిఫ్టి 17400ని దాటే అవకాశముంది. ఇక పడితే నిఫ్టికి 17097, 17021 ప్రాంతంలో మద్దతు లభించే అవాకశముంది. ఈ స్థాయిలను కూడా కోల్పోతే 16966, 16907 ప్రాంతానికి చేరొచ్చని అంటున్నారు. ఇతర లెవల్స్‌ కోసం ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=b0gklWu8R3c