అయ్యో రిలయన్స్…
రిలయన్స్ ఇండస్ట్రీస్ 14వ ఏజీఎంలో కంపెనీ ఛైర్మన్ ముకేష్ అంబానీ చేసిన పలు ప్రకటనలు మార్కెట్‌ను ఏమాత్రం రంజిప లేకపోయాయి. బోనస్ షేర్ల ఇష్యూను మార్కెట్ ఏమాత్రం పట్టించుకోలేదు. మార్కెట్ లాభాల్లో పయనిస్తున్నా… రిలయన్స్ షేర్ రివర్స్‌లో సాగింది. ముకేష్ అంబానీ చేసిన ప్రకటన వల్ల ఇన్వెస్టర్లకు వెంటనే ఒరిగిందేమీ లేదని స్టాక్ మార్కెట్ విశ్లేషుకులు అంటున్నారు. అన్నీ దీర్ఘకాలిక స్టేట్‌మెంట్లు మాత్రమేనని, తక్షణం వాటాదారులకు దక్కే ప్రయోజనాలు ఏవీ లేవని వీరు అంటున్నారు. మోతీ లాల్ ఓస్వాల్ వంటి బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ టార్గెట్ రూ. 3435గా పేర్కొన్నా… షేర్ ధరలో చలనం లేదు. పైగా షేర్ ఇవాళ 16.90 నష్టంతో రూ. 3024 వద్ద ముగిసింది. నిఫ్టి జోరుమీద ఉన్నపుడు కూడా ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడం విశేషం. డిస్నీ డీల్ కూడా ఈ గ్రూప్ కంపెనీల షేర్లను ప్రభావితం చేయలేకపోయాయి. టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ షేర్ స్వల్పంగా క్షీణించగా, టీవీ18 నెట్‌వర్క్ షేర్ మాత్రం ఏకంగా 5 శాతం దాకా నష్టపోవడం విశేషం.