HDFC Bank: కొనుగోలుకు ఛాన్స్
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు రెకమెండ్ చేస్తున్నాయి. బ్యాంక్ పనితీరు గాడిలో పడిందని ఈ షేర్న రూ. 1900 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని బ్యాంక్ ఆప్ అమెరికా సలహా ఇచ్చింది. సీఎల్ఎస్ఏ బ్రోకింగ్ సంస్థ కూడా ఈ షేర్ కొనుగోలుకు సిఫారసు చేసింది. బ్యాంక్ పనితీరు మున్ముందు బాగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయిన పేర్కొంది. హచ్డీఎఫ్సీ బ్యాంక్ అద్భుత పనితీరు కనబర్చిందని డ్యామ్ క్యాపిటల్ పేర్కొంది. ఈ బ్రోకింగ్ సంస్థ ఈ షేర్ టార్గెట్ ధర రూ. 1825గా పేర్కొంది. ఈ షేర్ కనీసం 27 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. బ్యాంక్ నిరర్థక ఆస్తులు బాగా తగ్గినట్లు తెలిపింది. గతవారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభంలో 22 శాతం వృద్ధి నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గడిచిన త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.11,125.21 కోట్ల కన్సాలిటేడ్ లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.9,096.19 కోట్ల లాభాన్ని గడించింది. బ్యాంక్ ఆదాయం రూ.38,754 కోట్ల నుంచి రూ.46,182 కోట్లకు పెరిగింది. స్టాండ్ అలోన్ ఫలితాలను చూస్తే బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.10,605.78 కోట్లకు చేరింది. అలాగే నికర వడ్డీ ఆదాయం 18.9 శాతం పెరిగి రూ.21,021 కోట్లకు చేరాయి.